తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసి ఒక రోజు దీక్ష*
Dabang Sahafat••7 వీక్షణలు•1 నిమిషాలు చదువు
Dabang news buro
*తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసి ఒక రోజు దీక్ష*
నిర్మల్, 16 సెప్టెంబర్ దబాంగ్ సహఫత్
నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఒకరోజు దీక్షలో భాగంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు భూక్య రమేష్ మాట్లాడుతూ సెంట్రలైజేడ్ కిచెన్ విధానం రద్దు చేయాలని అలాగే 2023 2024 సంవత్సరంలో సంబంధించిన 9 నెలల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేసి ఇప్పుడు ప్రారంభించే అల్పహార పథకాన్ని వంట కార్మికులతోనే నిర్వహించాలి. అల్పహారానికి సంబంధించి వీధి విధాలు ప్రకటించాలని. గ్యాస్ తో సహా వంట పథకం కి సరుకులు మొత్తం ప్రభుత్వమే సరఫరా చేయాలని. జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న జూన్ జూలై ఆగస్టు పెండింగ్ బిల్లు విడుదల చేయాలని. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు అందించే అల్పాహారం మద్దెన భోజన కార్మికులకు అప్పగించాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వంట కార్మికులకు రూపాయలు 10000 ఇస్తామన్నా హామీని వెంటనే అమలు చేయాలి. వంట కార్మికులకు ప్రభుత్వం గుర్తింపు కార్డు ఇవ్వాలి. లకు ప్రమాద బీమా పథకం అమలు చేయాలి వంట కార్మికులను రాజకీయ మరే ఇతర కారణాలతో తొలగించరాదు ప్రతి విద్యార్థికి మేస్చార్జి రూపాయలు 25 రూపాయలు చెల్లించాలి. కావున పైన నయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో అక్టోబర్లో రిలే నిరాహార దీక్షలు చేపడతామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన జిల్లా నాయకురాలు చిట్యాల లక్ష్మి అంకం రజిత ఫర్జానా. లలిత శ్రావణి నరసవ్వ రమణ సాయన్న లతీఫ్ అన్ని మండలాల మధ్యాహ్న భోజన కార్మికులు ఏఐటీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు