కలెక్టరేట్ లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు* *ముఖ్య అతిథిగా హాజరైన మైనారిటీ వెల్ఫేర్ మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రివర్యులు అజాహారుద్దీన్* *జిల్లా ప్రగతి నివేదికను ఉపన్యాసించిన మంత్రి*
Dabang Sahafat••18 వీక్షణలు•8 నిమిషాలు చదువు
Dabang news
కలెక్టరేట్ లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు*
*ముఖ్య అతిథిగా హాజరైన మైనారిటీ వెల్ఫేర్ మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రివర్యులు అజాహారుద్దీన్*
*జిల్లా ప్రగతి నివేదికను ఉపన్యాసించిన మంత్రి*
------------------------------- జగిత్యాల, సెప్టెంబర్ 17 --------------------------------
గురువారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మైనారిటీ వెల్ఫేర్ మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రివర్యులు అజాహారుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంగనభట్ల దినేష్, జిల్లా అదనపు కలెక్టర్లు బి.ఎస్ లత, బి. రాజ గౌడ్, జిల్లా రెవెన్యూ అధికారి కె.వై ప్రసాద్, జగిత్యాల ఆర్డీవో మధు సూదన్ పాల్గొన్నారు.
*ఈ సందర్భంగా మంత్రి అజాహారుద్దీన్ మాట్లాడుతూ*
గౌరవనీయులైన ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు, జగిత్యాల జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతం నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్య భారతదేశంలో అంతర్భాగమైన చారిత్రాత్మక రోజు ఈ రోజు. ఈ చారిత్రక ఘట్టానికి 78 సంవత్సరాలు పూర్తై, 79వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. నాటి తెలంగాణ ప్రజల త్యాగాలు, పోరాటాలు, స్వాభిమాన ఆకాంక్షలు మనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, ప్రజా పాలన అందించడం, ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని, ప్రతి ప్రాంతానికి అభివృద్ధిని చేరవేయడం మనందరి బాధ్యత. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం ఏర్పడిన ప్రజా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడి సెప్టెంబర్ 1 నాటికి 1000 రోజుల ప్రజాపాలనను పూర్తి చేసుకుంది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ప్రజా సంక్షేమం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, మౌలిక వసతుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం అనేక కీలక కార్యక్రమాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడం, విద్యా ఉద్యోగ అవకాశాలను విస్తరించడం, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలకు బాటలు వేయడం, భవిష్యత్తు తెలంగాణకు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి చేకూర్చే పథకాల అమలుతో పాటు కొత్త చట్టాలు, కొత్త విధానాలు, కొత్త సంస్థలు, కీలక పరిపాలనా సంస్కరణలకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రజా పాలన అంటే కేవలం ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితమైన పాలన కాదు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపే పాలన. పారదర్శకత, జవాబుదారీతనం, సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం అనే నాలుగు ప్రధాన స్తంభాలపై ప్రజా ప్రభుత్వం తన పాలనను కొనసాగిస్తోంది. రాష్ట్రాన్ని భవిష్యత్ తరాలకు మరింత బలమైన, అభివృద్ధి చెందిన, ఆర్థికంగా శక్తివంతమైన తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ‘తెలంగాణ రైజింగ్–2047’ దార్శనిక పత్రాన్ని రూపొందించాం. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం ఈ విజన్ ప్రధాన లక్ష్యం. గ్రామీణ తెలంగాణను బలోపేతం చేస్తూనే పట్టణ ప్రాంతాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడం ద్వారా సమతుల్య ప్రగతిని సాధించాలన్నది ప్రజా ప్రభుత్వం లక్ష్యం. అభయహస్తం హామీలను దశలవారీగా అమలు చేయడంతో పాటు, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా, ప్రతి గ్రామం మరియు పట్టణం అభివృద్ధి చెందేలా ప్రజలకు చేరువైన పాలనను అందిస్తోంది. రైతులకు రైతు భరోసా, పంటలకు మద్దతు, మహిళలకు మహాలక్ష్మి, గృహజ్యోతి ద్వారా కుటుంబాలకు ఉపశమనం, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా నిరు పేదలకు సొంతింటి కల, విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు, పేదలకు మెరుగైన వైద్య సేవలు, యువతకు ఉద్యోగాలు–నైపుణ్యాభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలతో ప్రజా ప్రభుత్వం సంక్షేమం–అభివృద్ధిని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈ 1000 రోజుల ప్రజాపాలనలో రాష్ట్ర ప్రగతితో పాటు జగిత్యాల జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా, సమర్థవంతంగా అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. ప్రజల భాగస్వామ్యంతో జగిత్యాల జిల్లాను అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మీ ముందుంచుతున్నాను.
చారితాత్మక ఘట్టానికి శ్రీకారం :
పురాతన దేవాలయాల అభివృద్దిలో భాగంగా ధర్మపురి శ్రీ ఉగ్ర నరసింహ ఆలయ పునర్నిర్మాణానికి 2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని రూ. 200 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఇటీవలే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిచే శంకు స్థాపన పనులు నిర్వహించడం జరిగినది. అర్హులందరికీ
నూతన స్మార్ట్ రేషన్ కార్డులు :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన నూతన స్మార్ట్ కార్డు లలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అర్హులైన లబ్దిదారులకు 3 లక్షల 53 వేల 682 మందికి అందించడం జరుగుతుంది.
నూతన చేయూత పెన్షన్లు:
జగిత్యాల జిల్లాలో వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, HIV/AIDS, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు తదితర 11 కేటగిరీలకు చెందిన 2,14,076 మంది లబ్ధిదారులకు ప్రతి నెల సుమారు రూ.46 కోట్ల 26 లక్షల పెన్షన్లు అందిస్తున్నాం. నూతన పెన్షన్ల మంజూరీ కొరకు అన్ని రకాల పెన్షన్ దారుల నుండి 15 వేల 432 దరఖాస్తులు స్వీకరించనైనది.
మహిళా ఆర్థిక సాధికారత:-
జిల్లాలో ఇప్పటి వరకు 285 కోట్ల 68 లక్షల వడ్డీ లేని రుణాలను అందించడం జరిగింది. వడ్డీ మాఫీ కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి 32 కోట్ల 58 లక్షల వడ్డీ మాఫీ నిధులను అందించడం జరిగింది. స్త్రీ నిధి సంస్థ ద్వారా మహిళలకు 2026-2027 ఆర్థిక సంవత్సరంలో 28 కోట్ల 30 లక్షల రుణాలు ఇవ్వడం జరిగింది.
వనమహోత్సవం :
12 వ విడత వనమహోత్సవంలో భాగంగా 2026 -27 సంవత్సరమునకు జిల్లాలోని 380 గ్రామ పంచాయితీలలో నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగినది. 52 లక్షల మొక్కలు మొక్కలు పెంచడం జరిగినది. ఇంటి ఆవరణలో మొక్కలు నాటుటకు 21 లక్షల 78 వేల మొక్కలు పంపిణీ చేయడం జరిగినది. అవెన్యూ ప్లాంటేషన్, ఈత ప్లాంటేషన్ మరియు కమ్యూనిటీ స్థలాలలో 8 లక్షల 66 వేల మొక్కలు నాటడం జరిగినది.
మహాలక్ష్మి పథకం :
జిల్లాలో ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని 77 కోట్ల 72 లక్షల మంది మహిళలు వినియోగించుకున్నారు. 328 కోట్ల 56 లక్షల రూపాయల లబ్ధి పొందారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటి వరకు 14 లక్షల 10 వేల 844 గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకే సరఫరా చేయడం జరిగింది. దీనికి 44 కోట్ల 79 లక్షల రూపాయల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది.
గృహజ్యోతి :
200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వినియోగదారులందరికీ జీరో బిల్లులు జారీ చేస్తోంది. జిల్లాలో 2 లక్షల 0 4 వేల 293 సర్వీసులకు గాను 80 కోట్లు 32 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది.
ఇందిరా మహిళా శక్తి :
జిల్లాలో 22 వ్యక్తిగత యూనిట్లకు 4 కోట్ల 12 లక్షల రూపాయలు లక్ష్యంగా నిర్దేశించగా, 65 మహిళా సంఘాల వ్యక్తిగత యూనిట్లకు ఈ ఏడాది 1 కోటి 81 లక్షల రుణాలు ఇప్పించడం జరిగింది. జిల్లాలోని (5) మున్సిపాలిటీలలో 18 వేల 310 వీధి వ్యాపారులను గుర్తించి, 13 వేల 202 వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా 36 కోట్లు 8 0 లక్షల రూపాయల రుణాలను మంజూరు చేసినాము.
మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల శాఖ :
జిల్లాలో 1 వెయ్యి 65 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 11 వేల 86 మంది గర్భిణీ, బాలింతలకు, 29వేల 587 టీ.హెచ్.ఆర్. చిన్నారులకు, 13 వేల 123 మంది పిల్లలకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన పోషకాహారం అందజేస్తున్నాము.
ఇందిరమ్మ ఇండ్లు :
ప్రతి పేదవాడి కళ సొంత ఇల్లు. ఈ సొంత ఇంటి కళను సాకారం చేసేందుకు జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా, దరఖాస్తు చేసుకున్న 10 వేల 365 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే 9 వేల 18 ఇండ్ల నిర్మాణాలలో 2 వేల ఐదు వందలా 22 ఇండ్లు పూర్తి కాబడినవి దీనికి గాను 246 కోట్ల 93 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది.
వ్యవసాయ శాఖ :
జిల్లాకు పచ్చి రొట్ట విత్తనాలు ( జీలుగ) 12 వేల 500 క్వింటాళ్లు, జనుము 900 ల క్వింటాళ్లు కేటాయించగా ఇప్పటి వరకు 10 వేల 913 క్వింటాళ్లు, 892 లక్షల రూపాయల సబ్సిడీతో జిలుగు విత్తనాలను 792 క్వింటాళ్లు 61 లక్షల 50 వేల రూపాయలతో సబ్సిడీతో రైతులకు జనుము విత్తనాలను రైతులకు అందజేయడం జరిగినది. రైతు బీమా ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో వివిధ కారణాలతో మరణించిన రైతు కుటుంబాలకు 5 వేల 707 మందికి 285 కోట్ల 35 లక్షల రూపాయల ఆర్థిక చేయూత కల్పించడం జరిగింది.
విద్యాశాఖ :
రాష్ట్ర ప్రభుత్వం మన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో బోధన అందించేందుకు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో YOUNG INDIA INTEGRATED RESIDENTIAL SCHOOLS, గాను ప్రతి నియోజకవర్గమునకు 200 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. కేంద్రీయ విద్యాలయ పాఠశాల నిర్వహణకై భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుని, ప్రస్తుతం జిల్లా కేంద్రం లోని తాత్కాలిక భవనంలో అడ్మిషన్లు పూర్తి అయినవి. ప్రాథమిక విద్యా వ్యవస్థ బలోపేతానికై FLN డిస్ట్రిక్ట్ సెల్ ప్రారంభించబడింది. జిల్లాలోని పిల్లలు అందర్నీ 80 శాతం సామర్ధ్యాలు సాదించేలా కార్యాచరణ చేపట్టడం జరిగినది.
సంక్షేమ వసతి గృహాలు :
షెడ్యూల్డ్ కులాలు, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో వసతి గృహాలు నిర్వహిస్తున్నాం. అక్టోబర్-2024 నుండి విద్యార్థులకు 200 శాతం డైట్ ఛార్జీలు, 40 శాతం కాస్మొటిక్ ఛార్జీలు పెంచారు. మరియు కామన్ డైట్ మెనూ అమలు చేస్తున్నారు.
మైనారిటీ సంక్షేమం :
జిల్లాలో మైనారిటీ మహిళలకు 598 కుట్టుమిషన్లు, 150 మంది యువతకు స్కిల్ డెవలప్మెంట్, రేవంత్ అన్న క సహరా 15 మంది లబ్ధిదారులకు 15 లక్షలు, ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన ద్వారా 76 మంది లబ్ధిదారులకు 38 లక్షలు మంజూరు చేయడం జరిగినది.
వైద్య ఆరోగ్యశాఖ :
వైద్య ఆరోగ్య రంగంలో జగిత్యాల జిల్లా గణనీయమైన ప్రగతి సాధించింది.జిల్లాలో 102 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 6 బస్తీ దవాఖానాలు, 17 PHCలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 3 CHCలు, మాతా శిశు కేంద్రం, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ద్వారా సేవలు అందుతున్నాయి. ఏప్రిల్–సెప్టెంబర్ -10- 2026 వరకు జిల్లాలో జరిగిన 4 వేల 324 ప్రసవాల్లో 1865 ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తూ, ఈ ఏడాది 10 వేల 72 చికిత్సలకు గాను రూ.30 కోట్ల 20 లక్షలు ఖర్చు చేశాము.
పంచాయితీ రాజ్ శాఖ :
తెలంగాణ ప్రభుత్వం SFC నిధుల నుండి గ్రామ పంచాయతిలలో పని చేస్తున్న 1547 మంది పారిశుద్ధ్య కార్మికులకు మరియు 385 మంది గౌరవ సర్పంచులకు గౌరవ వేతనములను ప్రతి నెల 1 వ తేదీన అందించడం జరుగుతుంది.
కార్మిక శాఖ:
జిల్లాలో ఒక లక్షా 8 వేల 566 మంది నిర్మాణ కార్మికులుగా నమోదు చేసుకోగా వివిధ పథకాల క్రింద 16 వేల 659 కార్మికులకు గాను 62.4 కోట్ల ప్రయోజనం కల్పించడం జరిగినది. NAC నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్సన్స్ ద్వారా 6 వేల 761 మంది కార్మికులకు వివిధ రంగాలలో శిక్షణ అందించి 3 కోట్ల 73 లక్షల విలువ గల స్టైపెండ్ అందించడం జరిగినది.
భూభారతి :
జిల్లాలో భూ భారతి చట్టంలో భాగంగా నక్ష లేని 20 గ్రామాలు ఎంపిక జరిగింది. ఇట్టి గ్రామలలో సర్వే పనులు శర వేగంగా జరుగుతుంది.
మత్స్య శాఖ :
జిల్లాలో 100% సబ్సిడీపై 763 చెరువులలో ఒక కోటి 69 లక్షల చేప పిల్లల పంపిణీ చేయడం జరుగుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా 150 మందికి 35 వేల రూపాయల చొప్పున మార్కెటింగ్ వివిధ బ్యాంకులు ఋణాలు మంజూరు చేయడం జరిగినది.
మున్సిపల్ శాఖ :
జగిత్యాల పురపాలక సంఘమునకు 15వ ఆర్థిక సంఘం నిధుల క్రింద 13 కోట్ల 23 లక్షలు మంజూరు కాగా పారిశుద్ధ్య వాహనముల కొనుగోలు, SWM, నీటి సరఫరాకు సంబందించిన పనులు చేపట్టనైనది. అమృత్ 2.0 పథకం క్రింద 38 కోట్ల 48 లక్షలు మంజూరు కాగా ట్యాంక్ నిర్మాణములు 19 కిలోమీటర్ ల పైడ్లైన్ పనులు, 2767 గృహాలకు నల్లా కనెక్షన్లు మంజూరు చేయనైనది.
రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారికి, జగిత్యాల జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం, సూచనలు అందిస్తున్న గౌరవ పార్లమెంటు సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, గౌరవ స్థానిక ప్రజా ప్రతినిధులకు, జిల్లా ఉన్నతాధికారులకు, పోలీస్ సిబ్బందికి, న్యాయాధికారులకు, ఉద్యోగులకు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులకు, స్వాతంత్య సమరయోధులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు, జిల్లా ప్రజలకు, ప్రతి ఒక్కరికీ పేరు పేరునా.. హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను.
జై హింద్.. జై తెలంగాణ....
ఈ కార్యక్రమం లో జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.
----------------------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి, జగిత్యాల చే జారీ చేయనైనది.