ముంపు గ్రామంగా ప్రకటించాలని గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామస్తులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం మధురానగర్ చౌరస్తాలో భిక్షాటన చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. నారాయణపూర్ రిజర్వాయర్‌తో తాము అష్ట కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.